Agent : “ఏజెంట్” ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్

-

యంగ్ హీరో అక్కినేని అఖిల్.. చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు.ఈ క్రమంలోనే సరైన హిట్ కోసం ‘ఏజెంట్’ రూపంలో వస్తున్నాడు అక్కినేని అఖిల్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరి అందించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ పిక్చర్ లో మాలీవుడ్ (మలయాళ) మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ‘‘ఏజెంట్’’ ఫిల్మ్ కోసం అక్కినేని అఖిల్ బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ చేశారు.

ఈ చిత్రంలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తోంది.తాజాగా ఈ చిత్ర అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి అఖిల్‌ ఫస్ట్‌ లుక్‌ ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news