రోజూ రాత్రి ఆల్కహాల్ తాగండి అంటున్న బుల్లితెర నటి ఐశ్వర్య..!!

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బాగా తమ టాలెంట్ ని ఉపయోగించుకుంటూ.. ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా అంటే కేవలం వెండితెర సెలబ్రిటీలకు మాత్రమే అంకితం అని అందరూ అంటూ ఉండేవారు. ఇక నెట్టింట సెలబ్రిటీలకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .

ఏ చిన్న ఫోటో వారు షేర్ చేసుకున్నా సరే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకోవడమే కాకుండా మరి ఎన్నో లైక్స్ కూడా పొందుతూ ఉంటారు. ఇకపోతే వెండితెర సెలబ్రిటీలతో ఏమాత్రం తీసిపోము అంటూ ఈమధ్య బుల్లితెర సెలబ్రిటీలు కూడా బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే.

మరీ ముఖ్యంగా ఇటీవల బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రాములు, టీవీ సీరియల్స్ , ఎంటర్టైన్మెంట్ షోలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రేక్షకులు వెండితెర తో పోలిస్తే .. బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక అందులో నటించే నటీనటులు కూడా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు . ఇక ఈమధ్య వారు కొంచెం సమయం దొరికినా సరే తమ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేయడం లేదా సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ మరింత పాపులర్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోని ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి ఐశ్వర్య కూడా బాగా పాపులారిటీని సొంతం చేస్తుకుంది.

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అగ్నిసాక్షి అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత కస్తూరి సీరియల్ లో నటిస్తూ అల్లరి పిల్లగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ప్రస్తుతం ఈ సీరియల్ కూడా టీఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈమె నవ్య స్వామి సోదరుడిని ప్రేమించి వివాహం చేసుకుంది.

ఇక అతడి సపోర్టుతోని ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి మెసేజ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఐశ్వర్య తాజాగా వైన్ గ్లాస్ ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రతిరోజు ఒక షిప్ తాగండి అంటూ ఆమె ట్యాగ్ లైన్ చేసింది. అది చూసిన నెటిజన్స్ అంతా అందం పోతుందేమో అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో బాగా వైరల్ గా మారుతోంది.