ఓటీటీలోకి ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా.. కానీ చిన్న ట్విస్ట్

-

అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్‌’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే చిన్న ట్విస్ట్ ఉందండోయ్. ప్రస్తుతం రెంట్ ప్రాతిపదికన (రూ.349) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ కీలకపాత్రలు పోషించారు.

ఇదీ స్టోరీ : అది 1952. హెల్సెంకీ ఒలింపిక్స్‌. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత ఫుట్‌బాల్‌ జట్టు, యుగోస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. ప్రత్యర్థి జట్టు ఏకంగా 10 గోల్స్‌ కొడుతుంది. సరైన బూట్లు కూడా లేని భారత ఆటగాళ్లు గాయాలపాలవుతారు. ఒలింపిక్స్‌లో భారత్‌ ఓటమిని ఎత్తి చూపుతూ పత్రికలు తీవ్ర విమర్శలు చేస్తాయి. ఈ క్రమంలో మన ఫుట్‌బాల్‌ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకున్న కోచ్‌ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్‌) ఆటగాళ్లకు ఎలా అండగా నిలబడ్డాడు? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, జట్టును మళ్లీ ఎలా సిద్ధం చేశాడు? అనంతరం జరిగిన టోర్నమెంట్‌లలో ఎలా రాణించింది? ఈ క్రమంలో సయ్యద్‌, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news