Good Bad Ugly : రిలీజ్ కాకుండానే రూ.95 కోట్లకు అజిత్ మూవీ ఓటీటీ రైట్స్!

-

తమిళ స్టార్ హీరో అజిత్ మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ను రివీల్ చేసిన మేకర్స్ అందులో రిలీజ్ డేట్ను ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే..?

ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ ఏకంగా రూ.95 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వార్త విని అజిత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రిలీజ్కు ముందే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే విడుదలైతే ఇక వసూళ్ల సునామే అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. త్వరగా టీజర్ విడుదల చేయండి అంటూ మూవీ టీమ్ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news