Big Boss OTT Telugu: ‘బిగ్ బాస్’ సస్పెన్స్‌కు బ్రేక్..హౌజ్ నుంచి అజయ్ ఔట్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ‘ఓటీటీ’ వారం ఎనిమిదో వారాంతం ఆదివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. హోస్ట్ నాగార్జున ఎంట్రీతో కంటెస్టెంట్స్ ఎగ్జైట్ అయ్యారు. ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అన్న టెన్షన్ ఏర్పడింది. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఈ విషయమై ఆందోళన చెందారు.

సోషల్ మీడియాలో ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే విషయమై రకరకాల వార్తలొచ్చాయి. అజయ్, హమీద, అషురెడ్డి వెళ్లిపోతరాని కొందరు అంచనా వేశారు. సింగిల్ ఎలమినేషన్ ఉంటే కనుక అజయ్ కే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని బీబీ లవర్స్, రివ్యుయర్స్ అంచనా వేశారు.

మరో వైపున ఆదివారం విడుదల చేసిన ప్రోమోలో బాబా మాస్టర్ తాను బయటకు వెళ్లేపుడు అషురెడ్డిని తీసుకెళ్తానని చెప్పడం చర్చనీయాంశమయింది.ఇటువంటి పరిస్థితులలో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎట్టకేలకు ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లాల్సిన సీన్ రానే వచ్చింది.

అజయ్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. అయితే, మిగతా ఎలిమినేట్ కంటెస్టెంట్స్ కంటే కూడా అజయ్ చాలా భిన్నంగా అనగా హుందాతనంగా ఎలిమినేషన్ సందర్భంగా అజయ్ ప్రవర్తించాడు. ఎలిమినేట్ అవుతున్నానని అనుకుని ఎవరిపైన ఆర్గుమెంట్స్ చేయకుండా హ్యాపీగానే బయటకు వచ్చేశాడు. అలా ‘బిగ్ బాస్’ షోలో ఎలిమినేషన్ సస్పెన్స్ కు బ్రేక్ పడ్డట్లయింది.

Read more RELATED
Recommended to you

Latest news