తెలంగాణ మహిళా జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కొత్తగా పునః నిర్మస్తున్న సచివాలయంలో మహిళా పాత్రికేయుల కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మహిళా జర్నలిస్టుల కోసం రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని ఆమె అన్నారు.
సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించేందుకు కమిటీలను వేయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు కవిత. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100కోట్లు ప్రకటించి, ఇప్పటి వరకు రూ.42కోట్లు దానిపై వచ్చిన వడ్డీతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష సహాయం, కుటుంబానికి ఐదేళ్ల పాటు రూ.3వేల పెన్షన్, పిల్లల చదువులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంక్షేమ నిధి నుంచి మీడియా అకాడమీ ఇస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.