అజిత్‌కు యాక్సిడెంట్ జ‌రిగిందా?

హీరో అజిత్ ప్ర‌మాదానికి గుర‌య్యారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాతో కోలీవుడ్‌లో స్టార్ డ‌మ్‌ని ద‌క్కించుకున్న అజిత్ ప్ర‌స్తుతం ‘వాలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సందర్భంగా అజిత్ ప్రమాదానికి గురయ్యార‌ని తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింద‌ట‌. అజిత్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఆయ‌న‌ని ఆసుపత్రికి తరలించారు.

హీరో అజిత్‌కు గాయాలు ఉన్నప్పటికీ షూటింగ్‌ని కొనసాగించాడ‌ట‌. షూట్ ముగించిన తరువాత ఆయ‌న చెన్నైకి బయలుదేరిన‌ట్టు తెలిసింది. గాయాల నుండి కోలుకోవడానికి అజిత్‌కు ఒక నెల రోజుల ప‌డుతుంద‌ని, అందు కోసం నెల‌పాటు `వాలిమై` మూవీ షూటింగ్‌కి విరామం ఇచ్చిన‌ట్టు తెలిసింది. అజిత్ మీడియాకు దూరంగా వుంటుంటారు. వివాదాల‌కు దూరంగా వుంటుంటారు. దీంతో ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న అజిత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అజిత్ గురించి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, ఆయ‌న బాగానే వున్నాడ‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నార‌ట‌. సెట్స్‌లో అజిత్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. ఇదే చిత్రం కోసం ఫ‌స్ట్‌ షెడ్యూల్‌లో బైక్ స్టంట్ షూట్ చేస్తున్నప్పుడు అజిత్ గాయపడ్డారు. అయితే ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే అజిత్ ఎక్కువ సార్లు ప్ర‌మాదానికి గురవుతుండ‌టం ఆయ‌న అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. `వాలిమై` చిత్రానికి `ఖాకీ` ఫేమ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నారు.