ఎన్నో రోజుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో ఉన్న పలు నిబంధనల సడలింపును చేస్తూ సరికొత్త నిబంధనలు తెరమీదికి తెచ్చింది ఐసిసి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి గల వయసు ఎంత అనేదానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ధారించిన కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి 15 ఏళ్లు నిండితే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఏ ఆటగాడైనా అనుమతి ఉంటుంది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 15 ఏళ్ళ లోపు క్రికెటర్ ని అంతర్జాతీయ క్రికెట్ లో ఆడించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం ముందుగానే సదరు సభ్య దేశం ఐసీసీ ముందు దరఖాస్తును ఉంచుకోవాల్సి ఉంటుంది.
ఇక ఐసీసీ ఈవెంట్లు సహా ద్వైపాక్షిక క్రికెట్ లో కూడా ఈ తరహా నిబంధన వర్తిస్తుంది అని స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. కాగా ఇప్పటివరకు అతి చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ప్లేయర్గా పాకిస్థాన్కు చెందిన హసన్ రాజా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పదహారేళ్ల 205 రోజుల వయసులో క్రికెట్ ఆడాడు..