పదిహేనేళ్ల చిన్నవాడిని ప్రేమిస్తాను అనుకోలేదు : సుష్మితా సేన్

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఎన్నో ఏళ్ల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది సుష్మితా సేన్. ఇక ఇప్పటికే కూడా పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇటీవల తన ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుస్మితాసేన్.

ప్రస్తుతం మోడల్ రొహ్మన్ షాల్ తో మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. కాగా తన కంటే పదిహేనేళ్ల చిన్నవాడైనా వ్యక్తిని తాను ప్రేమిస్తాను అనే విషయాన్ని కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది సుష్మితా సేన్. రొహ్మన్ ఒకసారి తనకు ఇంస్టాగ్రామ్ లో పర్సనల్గా మెసేజ్ చేశాడని అలా తామిద్దరి మధ్య మొదలైన పరిచయం కొంతకాలానికి రిలేషన్షిప్ గా మారింది అంటూ చెప్పుకొచ్చింది సుష్మితా సేన్. కాగా గతంలో వీరి ప్రేమ వ్యవహారం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే.