ట్రెయిన్ మిస్సయిందా.. అయితే డబ్బులు వాపస్..!

-

అన్ని ప్రయాణాల కన్నా ట్రెయిన్ జర్నీ ఎంతో కంఫర్టబుల్. అందుకే చాలా మంది రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అయితే.. ట్రెయిన్ జర్నీ అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్నదే. టైమ్ కు స్టేషన్ కు చేరకపోతే… ట్రెయిన్ మిస్సవుతుంది. ట్రెయిన్ మిస్సయితే ఒక్కోసారి తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందే.

If link train misses ticket charges will be refunded

అంతే కాదు టికెట్ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ఒక్కోసారి కనెక్టింగ్ ట్రెయిన్లను కూడా ఉపయోగిస్తుంటారు ప్యాసెంజర్లు. అంటే ఒక ట్రెయిన్ లో జర్నీ చేసి ఇంకో స్టేషన్ లో మరో ట్రెయిన్ ను క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఆసమయంలో కనెక్టింగ్ ట్రెయిన్ మిస్సయినా… ఆ ట్రెయిన్ కు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. అందుకే.. ఇకమీదట అటువంటి సమస్యలు రాకుండా… కనెక్టింగ్ రైలు మిస్సయితే.. దాని రిజర్వేషన్ కోసం వెచ్చించిన డబ్బులను తిరిగి ఇచ్చేయనుంది రైల్వే శాఖ. ఈ ఫెసిలిటీ ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.

టికెట్ ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా… రిజర్వేషన్ సెంటర్లలో బుక్ చేసుకున్నా.. కనెక్టింగ్ ట్రెయిన్ రిజర్వేషన్ చార్జీలను తిరిగి చెల్లించనుంది. దాంట్లో ఎటువంటి కటింగ్స్ కూడా ఉండవు. ఎంత డబ్బు చెల్లిస్తే.. అంత డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే.. ట్రెయిన్ మిస్సయిన మూడు గంటల్లో తాము ట్రెయిన్ ను మిస్సయినట్టు స్టేషన్ లోని కౌంటర్ లో తెలుపాల్సి ఉంటుంది. వాళ్లు ఒక అప్లికేషన్ ఫాం ఇస్తారు. దాన్ని నింపి టికెట్ కు సంబంధించిన ప్రూఫ్ ను జతచేసి కౌంటర్ లో ఇస్తే.. వాళ్లు డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు. ట్రెయిన్ ఆలస్యం అయినప్పుడు… ఇతర కారణాల వల్ల.. కనెక్టింగ్ ట్రెయిన్ మిస్సయిన వాళ్లకు ఇది ఎంతో ఉపయోగకరం అవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news