అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్.. స్ట్రెష్ రిలీఫ్ కు హ్యూమన్ టచ్..!

-

అక్కినేని అఖిల్ అఖిల్, హలో సినిమాల తర్వాత 3వ ప్రయత్నంగా చేస్తున్న సినిమా మిస్టర్ మజ్ ను. తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.

ఆరోజుల్లో స్ట్రెస్ రిలీజ్ కోసం మీరు ఏం చేసేవారు అంటే ఓ క్యారక్టర్ చాక్లెట్స్ తినేదాన్ని అంటుంది. ఆరోజుల్లో చాక్లెట్లతో పని అయిపోయేది కాని టుడేస్ స్ట్రెస్ లెవల్స్ కు హ్యూమన్ టచ్ కావాలి అంటాడు మన హీరో.. ఇక హీరోయిన్ తో ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు నాకోసమే పుట్టలేదు నిక్కి అంటూ క్రేజీ డైలాగ్ కొడతాడు. చూస్తుంటే నవ యువ మన్మధుడి మనసు గెలిచిన ఓ అమ్మాయి అతన్ని ఎలా మార్చేసింది అన్నది మిస్టర్ మజ్ ను కథ అని తెలుస్తుంది.

ఫిబ్రవరి 25 రిలీజ్ అవబోతున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాకు తమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా అయ్యేలా ఉంది. మరి తొలిప్రేమ మ్యాజిక్ వెంకీ అట్లూరి రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news