మిస్టర్ మజ్ను 2 మిలియన్ వ్యూస్..!

-

అక్కినేని అఖిల్ హీరోగా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యింది. అఖిల్, హలో సినిమాల తర్వాత అఖిల్ చేస్తున్న 3వ సినిమాగా మిస్టర్ మజ్ను పై అంచనాలున్నాయి. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

టీజర్ తో వచ్చిన అఖిల్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు. అంతేకాదు యూట్యూబ్ లో ఈ సినిమా 2 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. అఖిల్ ముందు రెండు సినిమాల కన్నా మిస్టర్ మజ్ను ఎక్కువ హైప్ క్రియేట్ చేసిందని చెప్పడానికి టీజర్ కు వచ్చిన వ్యూస్ చూస్తే అర్ధమవుతుంది.

లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా టీజర్ క్యూరియాసిటీ పెంచింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి రేసులో దిగుతుందని అంటున్నారు. మరి మిస్టర్ మజ్ను అయినా అఖిల్ కు కమర్షియల్ హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news