అఖిల్ సినిమాలో ప్రియాంకా..!

-

అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ మజ్ ను కూడా నిరాశపరచడంతో ఈసారి మరింత ఎక్కువ జాగ్రత్త పడుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ 4వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి కాగా త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా టాక్సీవాలా బ్యూటీ ప్రియాంకా జవల్కర్ ను ఎంపిక చేశారట.

తెలుగు అమ్మాయి అయిన ప్రియాంకా జవల్కర్ ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న ఈ అమ్మడు అఖిల్ సరసన కూడా నటిస్తుందని తెలుస్తుంది. అదే నిజం అయితే ఈ తెలుగు అమ్మాయికి లక్ కలిసి వచ్చినట్టే. తెలుగు పరిశ్రమలో తెలుగు వారికి అవకాశం ఇవ్వరు అన్న టాక్ ఉంది. ప్రియాంకా మాత్రం వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. చూస్తుంటే తెలుగు అగ్ర కథానాయికల సరసన నిలిచేలా ఉంది ఈ అమ్మడు.

Read more RELATED
Recommended to you

Latest news