కౌశల్ నిజం స్వరూపం ఇది..!

-

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కు సపోర్ట్ గా ఏర్పడిన కౌశల్ ఆర్మీ ఇప్పుడిప్పుడే కౌశల్ నిజ స్వరూపం ఇది అని తెలుసుకుని వాస్తవాలను బయటపెడుతుంది. హౌజ్ లో ఉన్న తనకు సపోర్ట్ గా ఓ ఆర్మీగా ఏర్పడి కౌశల్ కు సపోర్ట్ చేశారు. అయితే బయటకు వచ్చిన కౌశల్ దీని ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. అంతేకాదు కౌశల్ బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న 50 లక్షల ఎమౌంట్ క్యాన్సర్ పేషెంట్స్ కు విరాళంగా ఇస్తానని అన్నాడు. అది కూడా చేయలేదని తెలుస్తుంది. అదేమని అడిగితే నా డబ్బు నా ఇష్టం అని అంటున్నాడట.

ఇదిలాఉంటే కౌశల్ ఎక్కడకు వెళ్లినా కౌశల్ ఆర్మీ సభ్యులే తమ సొంత డబ్బులతో ఏర్పాట్లు చేసేవారట. ఇక ఒక కౌశల్ ఆర్మీ సభ్యురాలు 30,000 చెక్ తో ఓసారి అతన్ని కలిస్తే తన పేరు చెబితే మినిమం లక్షల్లో వసూళు చేయాలని అనడంతో ఆమె ఆశ్చర్యపోయిందట. ఇక పిఎం ఆఫీస్ నుండి కాల్.. డాక్టరేట్.. గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవన్ని కౌశల్ ఆడిన నాటకాలే అని తెలిసిందే.

ప్రస్తుతం కౌశల్ కు వ్యతిరేకంగా కౌశల్ ఆర్మీ సభ్యులే కామెంట్స్ చేస్తున్నారు. అయితే కౌశల్ తెలివిగా మిగతా వారితో వారిని కూడా ట్రోల్ చేసేలా చూస్తున్నాడట. బిగ్ బాస్ లో ఉన్న కౌశల్ వేరు.. తాము చూస్తున్న కౌశల్ వేరు అన్నది కౌశల్ ఆర్మీ వాదన. మొతానికి కౌశల్ ఆర్మీ ఇన్నాళ్లకు కౌశల్ నిజ స్వరూపం తెలుసుకుంది. జర్నలిస్ట్ మూర్తి కౌశల్ కు సంబందించిన విషయాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. కౌశల్ ఆర్మీ సభ్యులు డైరెక్ట్ గా అతన్ని కలిసి విషయం చెప్పడంతో కౌశల్ అసలు స్వరూపం బట్టబయలు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news