అఖిల్-3 ప్రీ లుక్ వచ్చేసింది

-

అక్కినేని అఖిల్ 3వ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తుంది. సినిమా అంతా యూరప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 20 ఏయన్నార్ జయంతి సందర్భంగా ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబర్ 19 సాయంత్రం 4 గంటలకు అఖిల్ 3వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట.

ఈ విషయాన్నే చెబుతూ అఖిల్ ట్వీట్ చేశాడు. మీరు రెడీనా.. మేము రెడీ.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు. తొలిప్రేమ సినిమాతో క్రేజీ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి సెకండ్ మూవీగా చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అఖిల్ మొదటి, రెండు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకోలేదు. అందుకే ఈసారి పక్కా హిట్ కొట్టేలా పకడ్బందీగా వస్తున్నాడు మరి అఖిల్ కోరుకునే హిట్ అందుకుంటాడా లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version