సినీ వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతుంటే.. మరి కొంత మంది ఇండస్ట్రీలోకి రావడానికి నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సర్వం సిద్ధం చేసుకుని ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నవారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య కొడుకు అకీరా నందన్ కూడా ఒకరు.. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరు వినిపిస్తే చాలు వాతావరణం హీటెక్కుతుంది. అలాంటి క్రేజ్ ఉన్న ఒక స్టార్ హీరో కి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.
ఈ క్రమంలోని ఈయన కొడుకు సినిమాల్లోకి హీరోగా వస్తున్నాడు అంటే ఇక ఆ రచ్చ ఎలా ఉంటుందో చెప్పలేము.. మొదటిరోజు ఓపెనింగ్స్.. స్టార్ హీరో రేంజ్ లోనే ఉంటాయి.. పైగా అకీరానందన్ చూడడానికి హాలీవుడ్ హీరోలాగా భారీ కట్ అవుట్ తో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి కూడా. ముఖ్యంగా అతడు వర్క్ అవుట్ సంబంధించిన వీడియోలు, కర్ర సాము , పియానో మ్యూజిక్ ప్లే అన్నీ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలోకి ఎప్పుడు వస్తాడు అని అడిగిన ప్రతిసారి కూడా అకీరా కి మ్యూజిక్ అంటే ఇష్టం.. యాక్టింగ్ మీద ఇష్టం లేదంటూ రేణు దేశాయ్ చెప్పుకుంటూ వచ్చింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఒక కథని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో సిద్ధం చేయించాడట. ఆయన ఎవరో కాదు పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ఈయన చేతిలో అకిరా నందన్ భవిష్యత్తు పెట్టబోతున్నారని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలు విజయాన్ని అందించినా.. అజ్ఞాతవాసి సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పీడకల.. అలాంటి దర్శకుడిని నమ్మి మళ్ళీ కొడుకు భవిష్యత్తును పెట్టవద్దు అంటూ కూడా కోరుతున్నారు. మరి ఏ మేరకు కొడుకుని ఇండస్ట్రీ లోకి తీసుకొస్తారో చూడాలి.