రాజన్నసిరిసిల్ల జిల్లాలో నేడు సెస్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వేములవాడ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. 15 స్థానాల్లో 75 మంది పోటీ చేయనుండగా, 87130 ఓట్లకు గాను73189 పోలైనవి. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి ఏడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం వర్గానికి సంబంధించి 8 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 స్థానాలకు గాను తక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న రుద్రంగి వీర్నపల్లి స్థానాల్లో తొలి ఫలితం రానుంది. 26 పోలింగ్ బూత్ లు ఉన్న ఇల్లంతకుంట బోయినపల్లి మండలాల్లో 13 రౌండ్ల ఫలితం రానుంది. ఇక రేపు సెస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగనుండగా, సెస్ ఎన్నికలు ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది. మంత్రి కేటీఆర్,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షణతో సెస్ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.