అక్కినేని హీరో మొదటి హిట్టు కొట్టాడా..!

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ చూస్తే అఖిల్ తొలి హిట్ కొట్టినట్టే అని తెలుస్తుంది. అఖిల్, హలో సినిమాల తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వెంకీతో మిస్టర్ మజ్ను సినిమా చేశాడు అఖిల్. ప్రేమకథతో వచ్చిన అఖిల్ ఆడియెన్స్ యాక్సెప్టెన్సీ లభించింది.

ముందు రెండు సినిమాలు అఖిల్ ను ఎంతగానో నిరాశపరచాయి. అందుకే మిస్టర్ మజ్ను సినిమాకు ముందునుండి జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. ప్రీ రిలీజ్ బజ్ కూడా అదరగొట్టగా ఫైనల్ గా అఖిల్ తన కెరియర్ లో మొదటి హిట్ అందుకున్నాడు. బోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రియదర్శి, హైపర్ ఆదిలు నటించారు.