అల్లు అర్జున్ కన్ను కొడితే ఎలా ఉంటదో తెలుసా? వీడియో

-

Allu Arjun Eye winking video goes viral

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలుసు కదా. ముఖ్యంగా అమ్మాయిలయితే అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోతారు. తాజాగా అల్లు అర్జున్ కన్ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే మన కన్ను కొట్టే సుందరి ఉన్నది కదా.. ప్రియా ప్రకాశ్ వారియర్.. హాండ్ గన్ తో కుర్రకారు గుండెల్లో బుల్లెట్లు దింపి కన్ను కొట్టి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. తన మూవీ లవర్స్ డే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఆ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. అల్లు అర్జున్ కు మలయాళంలోనూ ఫుల్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమాలన్నీ మలయాళంలో కూడా డబ్ అవుతుంటాయి. అందుకే.. ప్రియా నటించిన మలయాళం మూవీ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈసందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ తన స్పీచ్ తర్వాత ప్రియాలా హాండ్ గన్ తో పేల్చి… కన్ను కొట్టాడు. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news