డిజిట‌ల్ ఎంట్రీకి అక్కినేని హీరో కూడా రెడీ!

-

లాక్‌డౌన్ స‌మ‌యంలో వినోదానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఓటీటీలు నిలిచిన విష‌యం తెలిసిందే. ఇందులో సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల‌కే ఆడియ‌న్స్ అధిక ప్రాధాన్య‌త‌నిచ్చారు. చాలా వ‌ర‌కు సెల‌బ్రిటీస్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌ల‌ని చేయ‌డంతో అంద‌రి దృష్టి ఇప్పుడు వెబ్ సిరీస్‌ల‌పై ప‌డింది. అనుష్క శ‌ర్మ పాథాల్ లోక్, సైఫ్ అలీఖాన్ `సాక్రెడ్ గేమ్స్‌, ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్ పాపుల‌ర్ కావ‌డంతో వెబ్ సిరీస్‌ల‌పై స్టార్స్‌లోనూ ఆస‌క్తి మొద‌లైంది.

ఇప్ప‌టికే బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు వెబ్ సిరీస్‌ల బాట ప‌ట్టారు. తెలుగులో ఇప్పుడిప్పుడే ఆ సంస్కృతి మొద‌లైంది. `ఫ్యామిలీ మ్యాన్ 2`లో స‌మంత టెర్ర‌రిస్టుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా నాగ‌చైత‌న్య కూడా వెబ్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట‌ర‌వ్వ‌బోతున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఓ పాపుల‌ర్ ఓటీటీ అత‌నితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు టాక్‌. చై ఓకే అంటే వెంట‌నే ఓటీటీ వ‌ర్గాలు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయాల‌ని ఎదురుచూస్తున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news