Naga Chaitanya: ఆ విషయంలో నిర్మాతల అసంతృప్తి.. ‘థ్యాంక్స్’ సినిమా రీషూట్!

-

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయాన్ని ద‌క్కించారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య.

ఈ చిత్రంలో చైతూ.. హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను ర‌ష్యాలో చిత్రీక‌రించ‌నున్నారు. ఇందుకోసం లొకేష‌న్స్ ను వెతుకుతున్నార‌ట‌. ప్యాచ్ వర్క్ ని ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తి దృష్టి పెడతారు. ఈ క్ర‌మంలో దిల్ రాజు అండ్ కో టీమ్.. ఇప్పటివరకు షూట్ సీన్స్ ఔట్ పుట్ ను పరిశీలించారట.

అయితే… దిల్ రాజుకు కొన్ని సీన్స్ నచ్చలేదట‌. దీంతో మేకర్స్ ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలనుకుంటున్నారట. ఈ సీన్స్‌ను తిరిగి షూట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట. సినిమా అవుట్ పుల్ లో ఏమాత్రం త‌గ్గేదే లేదు అంటున్నారు దిల్ రాజు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో చైతూ.. మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. అందుకు తగినట్లుగానే తన లుక్ ను మార్చుకున్నాడు.

ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మన దేశంలో మూలాలు ఉండి.. విదేశాల్లో సెటిల్ అయినా చైతన్య.. తన మూలలను వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడనేదే ఈ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news