తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై వైసీపీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పార్టీ ఆఫీసులో నాలుగు బల్లలు..కుర్చీలు పగలగొడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టేనా అని కొడాలి ప్రశ్నించారు. ఎన్టీరామారావు ను సీఎం కుర్చీ నుండి దింపినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీ కొట్టు కూడా మూయరు అని అది ఆయన స్థాయి అంటూ కొడాలి విమర్శలు కురిపించారు. 420 చంద్రబాబు ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరడం హాస్యాస్పదం అంటూ కొడాలి షాకింగ్ కామెంట్లు చేశారు.
ఇదిలా ఉంటే నిన్న రాష్ట్రంలోని టీడీపీ ప్రధాన కార్యాలయం పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా రాష్ట్రంలోని పలువురు టీడీపీ నాయకుల ఇండ్ల పై కూడా దాడులు జరిగాయి. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు.