మ‌ల్టీస్టార‌ర్ సినిమాల హ‌వా.. కొడుకుతోనే వ‌స్తానంటున్న నాగార్జున‌

రాజ్ త‌రుణ్.. మంచు విష్ణు, వెంక‌టేశ్‌.. మ‌హేశ్‌, బ‌న్నీ.. రామ్ చ‌ర‌ణ్‌, వెంక‌టేశ్‌.. వ‌రుణ్ తేజ్ ఇలా టాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చాలానే మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు వ‌చ్చి మంచి హిట్ కొట్టాయి. విష‌యం ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఇలాంటి సినిమాలు ఎక్కువ‌గా హిట్ కొట్టాయి. ఎందుకంటే మ‌ల్టీ స్టారర్ సినిమాలంటే ఇండ‌స్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇద్ద‌రు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటేనే.. ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఏ హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో అని లెక్క‌లేసుకుంటారు వారి అభిమానులు. ఇక సీనియ‌ర్ హీరోలు ఇలాంటి వాటిపై పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌క‌పోయినా.. ఇప్ప‌టి స్టార్లు మాత్రం ఇందుకు రెడీగా ఉంటున్నారు.


అయితే ఇత‌ర హీరోల‌తో సినిమాలు చేయ‌డం వేరు.. త‌మ ఫ్యామిలీ హీరోల‌తో సినిమాలు చేయ‌డం వేరు. ఇప్ప‌టికే వెంక‌టేశ్ త‌న అన్న కొడుకు రానాతో, మంచు మోహ‌న్ బాబు త‌న కొడుకుల‌తో సినిమాలు చేశారు. అంతే కాదండోయ్ నాగార్జున కూడా త‌న ఫ్యామిలీతో సినిమా చేశాడు. ఇవ‌న్నీ త‌మ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ను తెలిపే విధంగా ఉన్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్యామిలీ హీరోతో క‌లిసి ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమా రాలేదు. ఈ దారిలో ఇప్పుడు మెగాస్టార్ ప‌య‌నిస్తున్నాడు. రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఇదే దారిలో ప‌య‌నిస్తున్నాడు నాగార్జున త‌న కొడుకు అఖిల్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాన‌ని ప్రెస్ మీట్ లో ప్ర‌క‌టించాడు. మ‌రి నాగ‌చైత‌న్య‌తో ఎందుకు చేయ‌ట్లేద‌ని అక్కినేని అభిమానులు సోష‌ల్ మీడియాలో ఒకింత అస‌హ‌నం కూడా చూపిస్తున్నారు. అయితే క‌థ డిమాండ్ మేర‌కు అఖిల్ తో చేస్తున్న‌ట్టు క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున. ఇప్ప‌టికే కార్తి, నానితో సినిమాలు చేసిన నాగార్జున మంచి విజ‌యాలు అందుకున్నాడు. మ‌రి కొడుకుతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాన‌ని చెప్పాడు నాగార్జున‌.