పింక్ క‌ల‌ర్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!

-

పింక్ క‌ల‌ర్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!కొంత మందికి ఆక‌ర్షించే హాట్ బాడీ వుండ‌దు కానీ ఊపిరి కూడా స‌ల‌ప‌ని ఆఫ‌ర్ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుప‌స్తుంటారు. కానీ కొంత మందికి మెస్మనైజ్ చేసే ‌హాట్ బాడీ వున్నాదాని త‌గ్గ‌ట్టుగా ఆఫ‌ర్ల‌ని సాధించ‌లేక‌పోతుంటారు. క‌న్న‌డ హాటీ అక్ష‌ర గౌడ ప‌రిస్థితి ఇంతే. కుర్ర‌కారుని కిర్రెక్కించే అందం అక్ష‌ర సొంతం కానీ ఏం లాభం ఆ స్థాయికి త‌గ్గ అవ‌కాశాల్ని మాత్రం ఇప్ప‌టికీ ద‌క్కించుకోలేక‌పోతోంది. త‌మిళ చిత్రం `ఉయతిరు 420`తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

కెరీర్ ప్రారంభించి ప‌దేళ్లు కావ‌స్తున్నా ఇంకా అస్థిత్వం కోసం ఫైట్ చేస్తూనే వుంది. స్టార్ నాయిక‌గా ఓ వెలుగు వెలిగే క్వాలిటీస్ అన్నీ వున్నా ఆ దిశ‌గా క్రేజీ ఆఫ‌ర్ల‌ని మాత్రం సొంతం చేసుకోలేక‌పోతోంది. నాగార్జున న‌టించిన `మ‌న్మ‌థుడు 2`లో రెచ్చిపోయి లిప్‌లాక్‌లు లాగించేసినా, శృంగార స‌న్నివేశాల్లో న‌టించినా పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. దీంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న `సూర్ప‌న‌గై` ( శూర్ప‌న‌ఖ‌) చిత్రంపై భారీ అంచ‌నాలు పెట్టుకుంది. తాజాగా పింక్ క‌ల‌ర్ బికినీలో సంద‌డి చేస్తూ అక్ష‌ర గౌడ్ స్విమ్మింగ్ ఫూల్‌లో చేసిన ర‌చ్చ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇన్ స్టాతో పాటు ట్వ‌ట్ట‌ర్‌లో సంద‌డి చేస్తున్నాయి. పింక్ బికినీలో అక్ష‌ర పిచ్చెక్కిస్తోంద‌ని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news