‘సరిలేరు నీకెవ్వరు’ కి భారీ షాక్ ఇవ్వనున్న ‘అలవైకుంఠపురములో’ టీమ్….. !!!

-

రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమాల మధ్య రోజురోజుకు పోటీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే సాంగ్స్ మరియు టీజర్ల రిలీజ్ తరువాత తమ సినిమాలపై అంచనాలను తారా స్థాయికి పెంచేసిన ఈ రెండు సినిమాల టీమ్ లు కూడా, ఎవరికి వారు ఇప్పటికే ప్రమోషన్స్ విషయమై గట్టిగా ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కాగా ప్లాన్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక అందులో భాగంగా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆ వేడుకకు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన్తున్నారు. అయితే వారికి ఏ మాత్రం తగ్గకుండా ఆర్ఆర్ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా, ఆ సినిమా దిగ్గజ దర్శకుడైన రాజమౌళి ని కూడా తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేకంగా ఆహ్వానించేలా అలవైకుంఠపురములో టీమ్ గట్టిగా ప్లాన్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరుగనుందని కూడా అంటున్నారు.

ఇక వేడుక కోసం బన్నీ, త్రివిక్రమ్, అల్లు అరవింద్ కలిసి వెళ్లి ఆర్ఆర్ఆర్ హీరోలు మరియు దర్శకులను మరొక రెండు రోజుల్లో ప్రత్యేకంగా అహ్వానించనున్నారని, అలానే వారు కూడా ఫంక్షన్ కు వచ్చే అవకాశం బాగా కనపడుతోందని అంటున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశ విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఆ విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి లను తమ ఫంక్షన్ కు ఆహ్వానించి సరిలేరు మూవీ యూనిట్ కి గట్టిగా షాక్ ఇవ్వనున్నారట .మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, బన్నీ ఫాన్స్ తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఇది మంచి పండగ వార్తే అని చెప్పాలి…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version