ఆలియా ఎలాంటి తప్పూ చేయలేదు!

-

ఆలియా ప్రియుడు రణబీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ (67) అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో రణబీర్ – ఆలియా పాల్గొన్నారు. వీళ్లంతా బిగ్గరగా ఏడ్చేసిన దృశ్యాలు హృదయాల్ని ద్రవింపజేసాయి.. అభిమానులు సైతం పాపం విలవిల్లాడిపోయారు. అయితే సడెన్ గా ఏమైందో ఆలియా చేతిలో ఫోన్ తీసుకుని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఈ ఫోటో ఆన్ లైన్ లో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. ఒకవైపు మామ చనిపోతే… ఆ టం లో ఫోన్ అవసరమా అని ఒకరంటే… ఫేస్ బుక్ లో లైవ్ ఇస్తుందా అని మరొకరు రకరకాల కామెంట్లు చేశారు. ఆ కామెంట్స్ ఒకటికి ఒకటి ఎక్కువై ఆఖరికి నెటిజన్లు అంతా ఆలియా పనిని తూర్పారబట్టారు. అనంతరం అసలు విషయం తెలుసుకుని ఆలియాకు సారీ చెబుతున్నారంట నెటిజన్లు!

ఇంతకీ ఆ సమయంలో ఆలియా ఎవరితో మాట్లాడింది అంటే… తండ్రి కడసారి చూపు కోసం ఎంతో పరితపించిపోతూ అంత్యక్రియలకు రాలేకపోయిన రిషీ కపూర్ కుమార్తె రిద్ధిమతో. అది కూడా ఆలియా తన ఫోన్ లో హిందూ సాంప్రదాయ విధానంలో అంత్యక్రియలు ఎలా చేస్తారో రిద్ధిమకు వీడియో కాల్ లో లైవ్ గా తనకు చూపించిందట. ఆ క్షణం ఎంతో ఉద్వేగానికి గురైనా రిద్ధిమ.. “పాపా నన్ను క్షమించు.. అక్కడికి రాలేకపోతున్నాను.. పాపా ఐ లవ్ యు.. ఐ విల్ ఆల్వేస్ లవ్ యు.. రెస్ట్ ఇన్ పీస్.. నా వారియర్ నిన్ను మిస్సవుతున్నా.. ఇక ఎప్పటికీ నీతో ముఖాముఖి కాల్ మాట్లాడలేను.. నేను నీ దగ్గరకు (అంత్యక్రియలు జరుగుతున్న చోటికి) రాలేకపోతున్నాను” అంటూ మనోవేదనను వ్యక్తం చేసిందట. ఇదంతా ఆలియా ఫోన్ లో జరిగిన సంభాషణ! కానీ అదేమీ తెలియని నెటిజనులు మాత్రం ఆలియా చేసిన పనిని తూర్పారబట్టారు. అసలేం జరిగిందో తెలీకుండా అసలే కష్టంలో దుఃఖంలో ఉన్నవారిని ఇలా తూలనాడడం సబబేనా? ఆలోచించండి నెటిజన్లు!

Read more RELATED
Recommended to you

Exit mobile version