ర‌ణ్ బీర్‌తో పెళ్లి అయిపోయింది.. అలియా భ‌ట్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

-

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప్రేమ పక్షులు ఏకం అవుతున్నారు. సినిమాల్లో క‌లిసి న‌టించిన వారు.. నిజ‌ జీవితంలోనూ క‌లిసి న‌డ‌వ‌డానికి సిద్ధం అవుతున్నారు. విక్కి కౌశ‌ల్ – క‌త్రినా క‌ఫ్, ప్రియాంక చోప్రా – నిక్ జోన‌న్, దీపికా ప‌దుకొనే – ర‌ణ్ వీర్ సింగ్ తో పాటు చాలా మంది ప్రేమ పక్షులు ఈ మ‌ధ్య కాలంలో ఏకం అయ్యారు. కాగ తాజా గా బాలీవుడ్ లో ర‌ణ్ బీర్ క‌పూర్ – అలియా భ‌ట్ ప్రేమ వ్య‌వ‌హారం హాట్ టాఫిక్ గా మారింది. తాము ఇద్ద‌రం ప్రేమ‌లో ఉన్నామ‌ని కూడా వారి అధికారికంగా ప్ర‌క‌టించారు.

దీంతో వీరి పెళ్లి ఎప్పుడు అని అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అలాగే ర‌ణ్ బీర్ క‌పూర్, అలియా భ‌ట్ వారి వారి సినిమాల్లో బిజీ గా ఉన్నారు. వీరు ఎక్కడ క‌నిపించినా.. మీడియా, అభిమానులు పెళ్లి గురించి అడుగుతున్నారు. తాజా గా ఒక కార్య‌క్ర‌మంలో అలియా భట్ ను… ర‌ణ్ బీర్ క‌పూర్ తో పెళ్లి ఎప్పుడు అని ప్ర‌శ్నించారు. దానికి స‌మాధానంగా అలియా భ‌ట్.. త‌న‌కు, ర‌ణ్ బీర్ క‌పూర్ కు మాన‌సికంగా ఎప్పుడో పెళ్లి అయిపొయింద‌ని ప్ర‌క‌టించింది.

అలాగే తాను ర‌ణ్ బీర్ క‌పూర్ ను మొద‌టి సారి చూసిన‌ప్పుడే త‌న పెళ్లి అత‌ని తోనే అని ఫిక్స్ అయ్యాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతం తాము రిలేషన్ షిప్ లో ఉన్నామ‌ని తెలిపింది. అలాగే సంతోషంగా కూడా ఉన్నామ‌ని తెలిపింది. త‌మ పెళ్లి డేట్ ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news