బీ టౌన్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ ఒక్కటి కాబోతున్నారు. వీరిరువురు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ముంబైలోని పాలీ హిల్స్ వాస్తు రెసిడెన్సీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా, ఓ విషయమై యాదృచ్ఛికంగా రణ్ బీర్ కపూర్ తన తండ్రి రిషి కపూర్ బాటలో వెళ్తున్నారని వార్తలొస్తున్నాయి.
రణ్ బీర్ కపూర్ ఫాదర్ రిషి కపూర్- నీతు సింగ్ ల ఎంగేజ్ మెంట్ 43 ఏళ్ల కిందట ఏప్రిల్ 13న జరిగిందని, కాగా, ఈ రోజు అనగా ఈ ఏడాది ఏప్రిల్ 13న రణ్ బీర్ కపూర్ -ఆలియా ఎంగేజ్ మెంట్ జరిగిందని పేర్కొంటున్నారు. ఈ సెలబ్రిటీ మ్యారేజ్ సీక్రెట్ గా జరుగుతుండటం గమనార్హం. ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీకి చెందిన కొంత మంది సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. చాలా గోప్యంగా వేడుకలు జరుగుతున్నాయి.
ఎట్టకేలకు రణ్ బీర్ కపూర్ – ఆలియా భట్ ఒక్కటవుతున్న తరుణంలో సినీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరిరువురు కలిసి జంటగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించారు. RRR సినిమాలో సీత పాత్రను ఆలియా భట్ పోషించింది. ఆమె పాత్రకు చక్కటి మార్కులు వేశారు సినీ ప్రేక్షకులు.
మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ఆ చిత్రంలో భాగమైనందుకు ఆలియా భట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ పిక్చర్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. రూ.1,000 కోట్ల క్లబ్ లోకి అతి తక్కువ టైంలో రీచ్ అయింది ఆర్ఆర్ఆర్ పిక్చర్.
https://www.instagram.com/p/CcRzEp8rxIg/?utm_source=ig_web_copy_link