టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన చిత్రం బచ్చలమల్లి. సుబ్బు మంగదేవి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈనెల 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బచ్చలమల్లి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరై రిలీజ్ చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. పుష్ప-2 సినిమాలో చిన్నాన్న సెంటిమెంట్ లాగే బచ్చలమల్లి మూవీలో కూడా చిన్నాన్న సెంటిమెంట్ ఉందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.
ట్రైలర్ లో నరేష్ క్యారెక్టర్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ గొడుగుతో వచ్చి ఈరోజు నుంచి మందు, సిగరేట్ అన్ని మానేయొచ్చు కదా అని అడగ్గానే.. వెంటనే నరేష్ మద్యం బాటిల్ పగులగొట్టి ఈరోజు నుంచి మందు, సిగరేట్ అన్నీ బంద్ అని చెప్పడం ఆక్టుకుంటోంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అదుర్స్ అనేలా ట్రైలర్ లో చూపించారు డైరెక్టర్ సుబ్బు మంగదేవి.