అల్లు అర్జున్ కి అవార్డు రావడం నటులందరికి గర్వకారణం – బాలకృష్ణ

-

తెలుగు సినిమాలపై జాతీయ అవార్డుల వర్షం కురవడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా సత్తా ప్రపంచ స్థాయిలో వెలిగిపోతుందని పేర్కొన్నారు. 65 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సోదరుడు అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం నటుడిగా తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

తెలుగు చలనచిత్ర రంగానికి ఇది ఒక గర్వకారణం అని పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ తో పాటు ఆరు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. అవార్డులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మంచి మంచి సినిమాలు తీస్తుందని అన్నారు. అన్ని భాషల వారు తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news