గ్లామ‌ర్ డోస్ పెంచుతున్న బ‌న్నీ..!

-

ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ టబు బన్నీకి తల్లి పాత్ర పోషిస్తుంది. గ‌తంలో త‌న అందాల‌తో అల‌రించిన ట‌బు చాలా కాలంగా త‌ర్వాత ఇప్పుడు త‌ల్లిగా త‌న అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించ‌బోతుంద‌ని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ త‌న తాజా సినిమాలో భారీ కాస్టింగ్‌ని మేళ‌విస్తున్నారు. స‌రికొత్త గ్లామ‌ర్‌ని యాడ్ చేస్తూ రోజు రోజుకి హైప్ పెంచుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకాల‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఇది మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇటీవల‌ రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండో షెడ్యూల్ ని ప్రారంభించుకుంది. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే పాల్గొంటున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ టబు బన్నీకి తల్లి పాత్ర పోషిస్తుంది. గ‌తంలో త‌న అందాల‌తో అల‌రించిన ట‌బు చాలా కాలంగా త‌ర్వాత ఇప్పుడు త‌ల్లిగా త‌న అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించ‌బోతుంద‌ని చెప్పొచ్చు.

ఇక తాజాగా ఇందులో మ‌రింత గ్లామ‌ర్ డోస్‌ని పెంచుతున్నారు. కీల‌క పాత్ర కోసం హీరో సుశాంత్‌, హీరోయిన్ నివేతా పేతురాజ్‌ని ఎంపిక చేశారు. చిత్ర బృందం శుక్రవారం ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. శుక్రవారం నుంచే ఈ ఇద్దరు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరి ఇందులో సుశాంత్‌, నివేతా పాత్ర‌లు ఎలా ఉంటాయ‌నేది స‌స్పెన్స్ గా మారింది. ఇందులో నివేతా ప్రత్యేక గీతంలో మెర‌వనున్నార‌నే మరో వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. ఇదే నిజ‌మైతే ఈ సినిమాకి మ‌రింత గ్లామ‌ర్ యాడ్ అవుతుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ సినిమాకి ‘అల‌కనంద’ అనే టైటిల్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే సరికొత్త ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.  అన్నా చెల్లి సెంటిమెంట్‌తోపాటు తండ్రి త‌న‌యుల సెంటిమెంట్ నేప‌థ్యంలో కుటుంబ విలువ‌లు ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగని పురస్కరించుకుని విడుదల‌ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి విజ‌యాల త‌ర్వాత వ‌స్తోన్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడ‌తారా? లేదా అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version