ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. గేమ్ చేంజర్ సినిమా విడుదల విషయంలో సినిమా టికెట్ల రేట్ల విషయంపై పవన్ కళ్యాణ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జనవరి 4 లేదా 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఫ్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించినట్టు సమాచారం అందుతోంది. మెగా ఈవెంట్ నిర్వహణ విషయంలో పవన్ తో చర్చిస్తున్నారు దిల్ రాజు. సినిమా టికెట్ రేట్ల అంశంతో పాటు, సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై పవన్ కల్యాణ్ తో దిల్ రాజ్ చర్చించే ఛాన్స్ ఉంది. కాగా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు.