1967 నుంచి ఒకసారి వాళ్లు.. మరోసారి వీళ్లు.. ఇలా ఆయా కుటుంబాల వాళ్లే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది భూమా, గంగుల ఫ్యామిలీలే. టీడీపీ తరుపున వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బరిలో దిగుతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకు బ్రిజేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన ఆళ్లగడ్డ టికెట్‌ను బీఎస్పీకి కేటాయించింది. అయితే.. ఈ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్యే. అయితే.. ఈ పోటీ అనేది కేవలం రాజకీయ పార్టీల చుట్టేనా? కాదు కాదు.. కానే కాదు.. రెండు వర్గాల మధ్య.. అది కూడా మూడు తరాల వైరం అది. మూడు తరాల నుంచి వాళ్లను వెంటాడుతూనే ఉన్నది.
ఇప్పుడు కాదు.. 1967 నుంచి ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా గంగుల, భూమా, సోముల కుటుంబాలకు చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అప్పట్లో గంగుల ప్రభాకర్ రెడ్డి తండ్రి తిమ్మారెడ్డి, భూమా నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. అయితే.. బాలిరెడ్డి హత్యకు గురయ్యాక… ఆయన కొడుకులు శేఖర్, నాగిరెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టారు. మరోవైపు తిమ్మారెడ్డి చనిపోయాక ఆయన కొడుకులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే.. తరాలు మారినా ఇరు కుటుంబాల మధ్య వైరం మాత్రం పోలేదు.
1967 నుంచి ఒకసారి వాళ్లు.. మరోసారి వీళ్లు.. ఇలా ఆయా కుటుంబాల వాళ్లే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా నామినేషన వేసిన శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికే ఆమె నామినేషన్ వేసి ఉండటంతో ఆమె అభ్యర్థిత్వమే కొనసాగడం.. ఆమె గెలవడం జరిగింది. తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి. భూమా అఖిల ప్రియ బరిలో దిగారు. టీడీపీ నుంచి అభ్యర్థి లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. తర్వాత భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరారు. ఇప్పుడు కూడా భూమా, గంగుల కుటుంబాలే బరిలో దిగుతున్నాయి. మరి ఈసారి ఏ కుటుంబం గెలుస్తుందో చూడాలి.