ఈరోజు అలా అమెరికాపురంలో ప్రోమో.. రిలీజ్‌చేయనున్న ఐకాన్ స్టార్!

తెలుగు తెర‌మీద‌ర సంగీతానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను త‌న‌దైన ట్యూన్స్‌తో ఎంట‌ర్ టైన్ చేస్తున్నాడు థ‌మ‌న్‌. ఆయ‌న బ‌న్నీతో చేసిన అలా వైకుంఠ‌పురంలో మ్యూజిక్ ఆల్బ‌మ్ ఎంత సెన్సేష‌న‌ల్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక టాలీవుడ్ ప్ర‌స్తుతం ఆహా ఓటీటీ యాప్ సినీ ల‌వ‌ర్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంది.

ala amerikapurramuloo | అలా అమెరికాపురంలో ప్రోమో

ఇక ఇప్పుడు కూడా అలాంటి ప్రోగ్రామ్‌ను సెట్ చేస్తోంది. ప్ర‌ముఖ సంగీత దర్శకుడు థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్‌ను ఆహా యాప్‌, హంసిని ఎంటర్ టైన్ మెంట్ కలిసి డిజైన్ చేస్తున్నాయి. ఈ థమన్ లైవ్ ఇన్ యూఎస్ ఏ ప్రోగ్రామ్‌కు అలా అమెరికాపురంలో అనే టైటిల్ కూడా ఇచ్చారు మేక‌ర్స్‌.

కాగా దీనికోసం పై అభిమానులు చాలా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రోమోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు(ఆదివారం) 7 గంటలకు విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టి నుంచి థ‌మ‌న్ ప్రోగ్రామ్ ఈ యాప్‌లోనే వ‌స్తుంద‌న్న మాట‌. అయితే ఇప్ప‌టికే 15 మూవీల వ‌ర‌కు అందించిన ఆహా.. త్వ‌ర‌లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో పాటే లవ్ స్టోరీ సినిమాను అందించ‌బోతోంది.