పుష్ప‌ కోసం రెడీ అవుతున్న బ‌న్నీ.. రిస్క్ తీసుకుంటున్న మూవీ టీమ్!

టాలీవుడ్‌ను ఇప్పుడు క‌రోనా క‌మ్మేసింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే చాలా పెద్ద సినిమాలు అన్నీ ఆగిపోయాయి. ఇంకొన్ని విడుద‌ల తేదీల‌ను వాయిదా వేస్తున్నాయి. సెకండ్ వేవ్ కార‌ణంతో లాక్‌డౌన్ ఉండ‌టంతో షూటింగులు అన్నీ నెల‌న్న‌రకుపైగా ఆగిపోయాయి. అయితే ఇప్పుడ స‌డ‌లింపులు ఇస్తుండ‌టంతో మ‌ళ్లీ ప‌ర్మిష‌న్ ఇస్తున్నారు.

కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ మూవీ పుష్ప. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మోస్ట్ వెయిటెడ్ గా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ అంచ‌నాల‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ఉండ‌బోతోంది.

అయితే క‌రోనా క‌రాణంగా ఈ సినిమా కూడా ఇప్పుడు ఆగిపోయింది. కాక‌పోతే ఇప్పుడు ప‌ర్మిష‌న్ రావ‌డంతో ఒక్క షెడ్యూల్‌లో దీన్ని పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు మూవీ మేక‌ర్స్‌. వ‌చ్చే నెల జులై ఫ‌స్ట్ వీక్‌లో హైదరాబాద్‌లోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. చాలావరకు షూటింగ్ ఈ ఒక్క షెడ్యూల్‌లోనే కంప్లీట్ చేస్తార‌ని తెలుస్తోంది. కాక‌పోతే రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఇప్పుడు హైద‌రాబాద్‌లో క‌రోనా కేసుల ఎక్కువ‌గా ఉండ‌టంతో బ‌న్నీ రిస్క్ తీసుకుంటున్నాడా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆయ‌న రీసెంట్‌గానే క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రి మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌స్తే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ఛాన్ష్ ఉంద‌ని ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నారు.