ప్యాన్ ఇండియా మూవీల‌కు జై కొడుతున్న అల్లు అర్జున్.. ఆ డైరెక్ట‌ర్‌తో డేర్ చేస్తున్నాడా?

టాలీవుడ్‌లో ఇప్పుడు అంద‌రు హీరోలు ప్యాన్ ఇండియా సినిమాల‌కు జై కొడుతున్నారు. ఈలిస్టులో ఇప్ప‌టికే ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో ఉంటే ఆ వెంట‌నే తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్‌తో ప్యాన్ ఇండియాకు జై కొట్టారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప‌తో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. భారీ యాక్ష‌న్ సీన్స్‌తో క్రియేటివ్ డైరెక్టర్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

అయితే దీని త‌ర్వాత కూడా బ‌న్నీ ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు జై కొడుతున్నాడు. ఇక స్టైలిష్ స్టార్ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణుశ్రీరామ్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టికే సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ప‌ట్టాలెక్క‌కుండా వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది.

కానీ ఇప్పుడు వేణుశ్రీరామ్ డైరెక్ష‌న్‌లో ఐకాన్ మూవీ చేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాడు. పుష్ప మొదటి పార్టు పూర్త‌వ్వ‌గానే ఐకాన్ మూవీని పట్టాలెక్కంచ‌డానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అయితే పుష్ప‌తో ఎలాగూ ప్యాన్ ఇండియా క్రేజ్ వ‌స్తుంది కాబ‌ట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వేణు శ్రీరామ్ క‌థ‌ను రెడీ చేస్తున్నాడంట‌. పవర్ ఫుల్ రోల్ లో అల్లు అర్జున్ పాత్ర ఉండేలా ప్లాన్‌చేస్తున్నాడు. త్వరలోనే దీనిపై అప్‌డేట్ వ‌చ్చే చాన్స్ ఉంది.