బ‌న్నీ ఖాతాలో మ‌రో రికార్డు.. మూడేళ్ల త‌ర్వాత సాధ్య‌మైంది!

నేను ప‌బ్బుల్లో వాయించే డీజే కాదురా.. ప‌గిలి పోయేలా వాయించే డీజేని..ఈ డైలాగ్‌ గుర్తుందా.. హా అవునండి దువ్వాడ జ‌గ‌న్నాథం మూవీలోనిది. ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా. అక్క‌డికే వ‌స్తున్నా ఆగండి. ఈ సినిమా విడుద‌ల‌యి మూడేళ్లు అవుతుంది. మూడేళ్ల‌కు బ‌న్నీ ఖాతాలో ఈ సినిమా ప‌రంగా ఓ రికార్డు వ‌చ్చి చేరింది. అదేంటి అంటారా అయితే పూర్తిగా చ‌ద‌వండి.

ఈ మ‌ధ్య చాలా సినిమాల టీజ‌ర్లు, ట్రైల‌ర్లు గంట‌ల వ్య‌వ‌ధిలోనే 30 నుంచి 50 మిలియ‌న్ల వ్యూస్ తెచ్చుకుని రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడున్న‌దంతా టీజ‌ర్లు, ట్రైల‌ర్ల రికార్డుల లెక్క‌లే. కానీ మూడేళ్ల క్రితం యూ ట్యూబ్ విడుద‌ల అయిన దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా 100మిలియ‌న్ల వ్యూస్ ను తెచ్చుకుని రికార్డుల కెక్కింది. ఈ సినిమాపై బ‌న్నీ పెట్టుకున్న ఆశ‌లు పెద్ద‌గా ఫ‌లించ‌లేదు. అప్ప‌ట్లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా ఆవ‌రేజ్ గా నిలిచింది. కానీ ఇందులోని పాట‌లు ఓ రేంజ్ లో దుమ్ములేపాయి. ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి.

రెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా చేసింది. దిల్ రాజు నిర్మించాడు. ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీగా వ‌చ్చిన డీజేకు దేవీ శ్రీ సంగీతం అందించాడు. ఇక క‌లెక్ష‌న్స్ ప‌రంగా కాస్త నిరాశే ఎదురైంది ఈ సినిమాకు. కానీ ఇప్పుడు ఓ రికార్డు మూవీ టీంకు కాస్త ఊర‌టే అని చెప్పాలి. ఇప్పుడు బ‌న్నీ ప్యాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నాడు. దీని గురించి త్వ‌ర‌లోనే అప్ డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.