బన్నీ ఇన్ని హిట్​ సినిమాలను వదులుకున్నాడా… ఇవి చేసుంటే వేరే లెవెల్ ఉండేది!

-

గంగోత్రి సినిమాతో టాలీవుడ్​లో హీరోగా పరిచయమయ్యారు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్. దేశముదురు, సరైనోడు, రేసుగుర్రం వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ మూవీలతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. పుష్పతో ఏకంగా పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయారు. అయినప్పటికీ బన్నీ తన కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నారట. ఇంతకీ అవేంటంటే..

బన్నీ తొలి చిత్రం గంగోత్రి సమయంలో.. దర్శకుడు తేజ ఆయనకు జయం కథ వినిపించారు. కానీ గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నితిన్ ఆ ఛాన్స్ కొట్టేసి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు.

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన భద్ర సినిమాను కూడా అల్లు అర్జున్​ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజకు వెళ్లింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఛాన్స్​ నాగ చైతన్యకు దక్కింది.

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పండగ చేస్కో సినిమాలో హీరోగా అల్లు అర్జున్​కే తొలి అవకాశం వచ్చింది. కానీ ఆ తర్వాత ఛాన్స్​ను యంగ్​ హీరో రామ్​ ఎగరేసుకుపోయారు. నాగ చైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ఒక లైలా కోసం. ఈ కథను కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేశారు.

సునీల్ హీరోగా నటించిన డిజాస్టర్ మూవీ కృష్ణాష్టమి చిత్రాన్ని మొదట అల్లు అర్జున్ కూడా రిజెక్ట్ చేశారట. బాక్సాఫీస్​ వద్ద సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్ర కథను మొదట బన్నీ, ఆ తర్వాత శర్వానంద్ రిజెక్ట్ చేశారట. అలాంటి కథలకు తాను సూట్ కానని బన్నీ ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. చివరకు విజయ్​ దేవరకొండకు ఆ ఛాన్స్​ దక్కింది. దీంతో ఆయన సెన్సేషనల్ స్టార్ అయిపోయారు.

దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని మొదట అల్లు అర్జున్​తో చేయాలని ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల తర్వాత వద్దనుకున్నారట. రవితేజ నటించిన డిస్కో రాజా చిత్రాన్ని కూడా అల్లు అర్జున్​ రిజెక్ట్​ చేశారు. 96 తెలుగు రీమేక్​ జానులో మొదట దిల్ రాజు.. హీరోగా బన్నీని అనుకున్నారట. ఈ కథను కొన్ని కారణాల అల్లు అర్జున్​ రిజెక్ట్ చేశారట.

గీత గోవిందం కథను దర్శకుడు పరుశురాం మొదట అల్లు అర్జున్ కు వినిపించగా.. దాన్ని కూడా వదులుకున్నారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అరవింద సమేత కథను త్రివిక్రమ్ మొదట బన్నీకి వినిపించినట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news