స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా కొనుగోలు చేసిన కార్వాన్ నిబంధనలకు విరుద్ధంగా అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతుండటంతో కొందరు నేటిజనులు ట్విటర్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అసలే సిటీ పోలీసలు యమా స్పీడ్ మీదుంటున్నారు. మొన్నటికి మొన్న పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్టు తాగుతున్నాడని హీరో రామ్ కు 300 జరిమానా వేసారు.సమాజంలో పేరున్న వాడు అని చూడకుండా చట్టం ముందురు అంతా సమానులే అని నిరూపించారు. తాజాగా బన్నీ కార్వాన్ పై చేసిన ఫిర్యాదుపైనా పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. రూల్స్ ను బ్రేక్ చేసాడు అన్న కారణంగా 735 రూ..లు జరిమానా విధించారు.
పేరున్న హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా అని అసహనం వ్యక్తం చేసారు. దీంతో నేటి జనులు తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు. సినిమా వల్ల సమాజాం చెడిపోతుంది… నీతులు చెప్పాల్సింది సినిమా లో కాదు..రియల్ లైఫ్ లో అంటూ బన్నీ పై సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. మరి బన్నీ టార్గెట్ శ్రద్దగా ఆఫోటోలు తీసి ట్విటర్లో పెట్టి పోలీసులకు ట్యాగ్ చేసింది ఎవరు? సాధారణంగా ఇలాంటి అభిమానులు చేయరు. ఎందుకంటే పోయేది ఆ హీరో పరువు కాబట్టి పట్టించుకోరు. కామన్ పీపూల్స్ కి పట్టించుకునేంత సమయం ఉండదు. తప్పు జరిగినా..జరిగితే జరిగిందిలే అని వదిలేసే సమాజం తప్ప. బాధ్యత తీసుకునే అంత సినిమా జనాల్లో లేదు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర లీకు అందింది.
ఆ ఫోటోలను తీసింది..ట్విటర్లో పెట్టి షేర్ చేసింది నటసింహ బాలకృష్ణ అభిమానులని కొందరి వాదన. ఈనెల 16వ తేదీని సాయంత్ర 4.30 గంటలకు హిమాయత్ నగర్ ప్రాంతంలో బన్నీ కార్వాన్ ట్రాఫిక్ లో వెళ్లోంది. ఆ సయంలోనే మహ్మద్ అబ్దుల్ అజం దాన్ని గమనించి ఫోటోలు తీసిపెట్టాడు. ఆ సమయంలో ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ కూడా పక్కనే ఉన్నాడుట. అతని సలహా మేరకే మహ్మద్ సోషల్ మీడియాలో ఆ ఫోటోను సోలీసులకు షేర్ చేసాడని ఓ రూమర్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత? అన్నది తేలాల్సి ఉంది.