ఇదిగో “పుష్ప రాజ్”‌.. ప‌రిచ‌యం అదిరింది.. “త‌గ్గేదే లే” రికార్డుల ఊచకోత పక్కా..!

Join Our Community
follow manalokam on social media

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ రిలీజైంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుక‌గా ఈ టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. అభిమానుల‌కు పండగ ఒక రోజు ముందే వ‌చ్చిన‌ట్లైంది. “త‌గ్గేదే లే” అంటూ చెప్పిన డైలాగ్‌..తో అల్లు అర్జున్ కేక‌పెట్టించాడు. టీజర్ రిలీజ్ కే ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ముందునుండి పుష్ప భారీ తనాన్ని చూపించడానికి టీజర్ రిలీజ్ కే ఇంత హంగామా చేసినట్టు తెలుస్తుంది.

ఇక టీజర్ విషయానికి వస్తే ఏదైతే బన్నీ అభిమానిలు కోరుకుంటున్నారో.. అవి లెక్కలు మించి ఉండేలా చూసుకున్నాడు సుకుమార్. ఈ క్రేజీ కాంబో సినిమా అది కూడ నేషనల్ వైడ్ అటెంప్ట్ ఎలా ఉండాలో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ టీజర్ ఉంది. ముఖ్యంగా టీజర్ లో బన్నీ లుక్, స్టైల్, డైలాగ్ డెలివరీ అబ్బో ఒకటేంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఆగష్టు 13న విందు భోజనం పక్కా అనిపించేలా టీజర్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. స్టైలీష్ స్టార్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న న‌టించ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిచాడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

పుష్ప టీజర్ ఇలా రిలీజైందో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాలం అంతా అతలాకుతలం అయ్యేలా అల్లు అర్జున్ పుష్ప టీజర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక రిలీజైన కొద్ది నిమిషాలకే ట్రెండింగ్ లో ఉండగా ఇక రానున్న గంటల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...