అర్జున్ రెడ్డిని చూసి అప్సెట్ అయిన బన్ని..!

-

Allu Arjun Upset after watching Vijay Arjun Reddy movie

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ఫ్లాప్ అయినా అంతకుముందు దాకా వరుస సినిమాలు హిట్లు కొట్టాడు. హీరోగా ఎలాంటి ఈగో చూపించని బన్ని వర్ధమాన నటుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం ఆడియో రిలీజ్ కు గెస్ట్ గా వచ్చాడు బన్ని.

ఈ సందర్భంగా విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా చూసి ఓ వారం రోజులు ఎవరితో మాట్లాడలేదని.. అంత బాగా నచ్చిందని చెప్పాడు. తెలుగులో ఉన్న హీరోల్లో మంచి నటులలో విజయ్ ఒకరని చెప్పాడు బన్ని. ఇక తను చేసిన గీతా గోవిందం సినిమా కథ తనకు తెలుసని.. సినిమా కూడా చూశానని ఈ సినిమాలో కూడా విజయ్ ఇరగదీశాడని అన్నాడు బన్ని.

పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news