ట్రైలర్ టాక్: సంక్రాంతి సంబరాన్ని మోసుకొస్తున్న అల్లుడు అదుర్స్..

Join Our Community
follow manalokam on social media

అల్లుడు అదుర్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా, పండగ సందడినంతా థియేటర్లలోకి తెచ్చేలా ఉంది. ట్రైలర్ ని చూస్తుంటే, ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ కొత్తగా ఉన్నట్టు తెలుస్తుంది. అమ్మాయిలంటేనే పడని హీరో, ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరగడం, పాత కాన్సెప్టే అయినా క్యారెక్టరైజేషన్ కొత్తగా కనిపిస్తుంది. బెల్లంకొండ మాటలు వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ట్రైలర్ ఆద్యంతం కమర్షియల్ అంశాలు దండిగా ఉన్నాయి.

హీరోయిన్లైన నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ అందాలు, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కలిపి మంచి మాస్ మసాలా సినిమా అని తెలుస్తుంది. దేవిశ్రీ అందించిన స్వరాలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం చక్కగా కుదరడంతో ట్రైలర్ అందరినీ ఆకర్షించింది. సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 15వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...