అతని మాయలో ఆరెక్స్ బ్యూటీ.. పెళ్లికి కూడా రెడీ అట..!

-

అజయ్ భూపతి డైరక్షన్ లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా ఆరెక్స్ 100. యూత్ ఆడియెన్స్ ను బాగా మెప్పించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అంతేకాదు పంజాబి భామకు ఇక్కడ మంచి పాపులారిటీ వచ్చింది. ఇప్పటికే పాయల్ మరో రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుందని తెలుస్తుంది.

ఇదిలాఉంటే రీసెంట్ గా ఓ గేమ్ షోలో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ తనకి విజయ్ దేవరకొండని పెళ్లాడాలని ఉందని చెప్పింది. పక్కన కార్తికేయ ఉన్నా అతన్ని కాదని విజయ్ ను పెళ్లాడతా అంటుంది పాయల్. రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా పాయల్ విజయ్ అంటే చాలా ఇష్టమని అతను ఒప్పుకుంటే పెళ్లాడేందుకు రెడీ అన్నది పాయల్. మరి పాయల్ రిక్వెస్ట్ కు విజయ్ దేవరకొండ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

గీతా గోవిందం సూపర్ హిట్ అవగా ఆ తర్వాత వచ్చిన నోటా విజయ్ కు నిరాశ మిగిల్చింది. నవంబర్ 16న టాక్సీవాలాతో వస్తున్న విజయ్ సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version