మలయాళ భామ అమలపాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచారు. కానీ.. ఇద్దరిమధ్య మనస్పర్ధాలు రావడంతో మూడేళ్లకే డాకులు తీసుకున్నారు. అయితే విజయ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక అమలాపాల్ ఇప్పుడు మళ్లీ సినిమాలో ఫుల్ బిజీగా మారింది. తాజాగా ‘ఆమె’ అనే సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ సన్నివేశంలో అమలపాల్ న్యూడ్ గా నటించింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలపాల్ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ఎదురైనా ప్రశ్నకి అమలపాల్ స్పందిస్తూ … అవును కచ్చితంగా చేసుకుంటాను.. లేకపోతే సన్యాసిగా ఉండిపోతనా అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా తానో మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అది కచ్చితంగా ప్రేమ పెళ్లిని చేసుకుంటానని చెప్పుకొచ్చింది.