నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!

-

ఈ రోజుల్లో చదువు చెబుతున్న కాలేజీలకూ.. ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకూ లింక్ లేకుండాపోయింది. ఇక ఈ రోజుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ కామన్ అయ్యింది. అలాంటిది ఇక రొటీన్ డిగ్రీ చేసేవారికి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి. అందులోనూ చదివే డిగ్రీలకూ.. అటు పరిశ్రమల్లో ఉద్యోగాలకూ సంబంధం ఉండటం లేదు. పరిశ్రమలకు ఏంకావాలో ఆ దిశగా డిగ్రీలు ఉండటం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్ ఏపీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ.. యూనివర్సిటీ పరిధిలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్య ప్రణాళికలో మార్పులు, శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ యూనివర్సిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి పొందాలన్నదే టార్గెట్‌.

ఐటీఐ, పాలిటెక్నిక్, బీకామ్‌ సహా డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అదనంగా ఏడాది పాటు అప్రంటీస్‌. అప్రంటీస్‌ చేశాక, ఇంకా శిక్షణ అవసరమనుకుంటే మళ్లీ నేర్పించాలని సూచించారు. ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, నెల రోజుల్లో కార్యాచరణకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ ప్రణాళిక నిజంగా అమలైతే..ఏపీ నిరుద్యోగులకు వరంగా మారడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news