యూజర్స్​కు షాక్.. అమెజాన్​ ప్రైమ్​లో యాడ్స్!

-

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఓ షాకింగ్ న్యూస్. ఇప్పటి వరకు సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లంతా ఎలాంటి యాడ్స్ లేకుండా నిర్విరామంగా తమకు నచ్చిన సినిమాలు, సిరీస్​లు చూస్తున్నారు కదా. అయితే ఇప్పుటు యాడ్ ఫ్రీ కంటెంట్ చూడటం కాస్త కష్టమేనంటున్నారు. ఎలాంటి ప్రకటనలూ లేకుండా సినిమాలు, సిరీస్‌లను అందించిన ఓటీటీ వేదికలు నెమ్మదిగా యాడ్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే డిస్నీ+హాట్‌స్టార్‌లో యాడ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో అమెజాన్‌ ప్రైమ్‌ నడవనుందట.

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా సినిమా, సిరీస్‌ చూడటం ప్రారంభించగానే ఒక యాడ్‌ వస్తోంది. అది కూడా స్కిప్‌ చేస్తే ఆ వీడియో పూర్తయ్యే వరకు ఇంకో యాడ్ రాదు. కానీ ఫ్యూచర్​లో మాత్రం అలా ఉండదట. ఇక నుంచి పరిమిత సంఖ్యలో ప్రకటనలను ప్రసారం చేయాలని అమెజాన్‌ ప్రైమ్ భావిస్తోందట. ఇందుకు సంబంధించిన కసరత్తులు ప్రారంభించిందట. 2024 ప్రారంభంలో దీన్ని అమలు చేయాలని భావిస్తోందట. అయితే, యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ చూడాలనుకుంటే, అదనంగా మరికొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రైమ్‌ సబ్​స్క్రిప్షన్​కు మరింత అదనంగా చెల్లించాలన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news