‘మేజర్’పై అమితాబ్ బచ్చన్ కామెంట్స్..మహేశ్ బాబు, అడివి శేష్ రియాక్షన్ ఇదే

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్..సినీ పరిశ్రమలో విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో మేజర్ గా శేష్ నటించాడు. ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది.

దేశవ్యాప్తంగా ఈ చిత్రం చూసి జనాలు గర్వంగా ఫీల్ అవుతున్నారు. మేజర్ సందీప్ అమర్ రహే అని నినదిస్తున్నారు. తాజాగా ఈసినిమాను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చూసి టీమ్ ను ప్రశంసించారు.

ట్విట్టర్ వేదికగా మేజర్ టీమ్ ను అభినందించారు. ముంబై 26/11 అటాక్ లో ప్రజలను కాపాడిన వీరుడు మేజర్ సందీప్ అని తెలిపారు. టీమ్ కు తన విషెస్ చెప్పారు. కాగా, ఈ ట్వీట్ పై సూపర్ స్టార్ మహేశ్ బాబు, అడివి శేష్ స్పందించారు.

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు అని సూపర్ స్టార్ రిప్లయి ట్వీట్ చేయగా, ఇది తనకు చాలా ఎక్కువని, లెజెండ్ స్వయంగా ట్వీట్ చేయడం హ్యాపీగా ఉందని అడివి శేష్ ట్వీట్ చేశాడు. థాంక్యూ సో మచ్ సర్ అంటూ..అమితాబ్ కు ధన్యవాదాలు తెలిపాడు. జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్. కాగా, ప్రకాశ్ రాజ్, రేవంత్ , శోభితా దూళిపాల కీలక పాత్రలు పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version