బీజేపీ బైట్ : దేశాన్నే ఎల‌ర్ట్ చేసిన నుపుర్ ? వామ్మో !

-

దేశ స‌మ‌గ్ర‌త‌ను, ప్రపంచ దేశాల‌తో మ‌న‌కు ఉన్న సన్నిహిత సంబంధ బాంధ‌వ్యాల‌ను దృష్టిలో ఉంచుకుని, శాంతి భ‌ద్ర‌త‌లను కూడా ప‌రిగ‌ణ‌న‌లో తీసుకుని ఎవ్వ‌రైనా మాట్లాడాల్సిందే ! లేదంటే తీవ్ర పరిణామాలే మున్ముందు కూడా చోటు చేసుకునేందుకు అవ‌కాశాలుంటాయి. ఆ విధంగా ఉండ‌కుండా చేయాలంటే నాయ‌కుల‌కు ముందు స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌రం. ప‌ర‌మ‌త స‌హ‌నం అవ‌స‌రం. ఇత‌ర పార్టీల‌ను ఉద్దేశించిన‌ప్పుడు, ఇత‌ర మ‌తాల‌ను ఉద్దేశించిన‌ప్పుడు ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించి, ఆందోళ‌న‌క‌ర మాట‌ల‌ను వ‌ద్ద‌నుకుని మీడియా ఎదుట ప్ర‌క‌ట‌న‌లిస్తే నుపుర్ శ‌ర్మ లాంటి ఎపిసోడ్లు రిపీట్ కావు గాక కావు.

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌కు సంబంధించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ లీడ‌ర్ నుపుర్ శ‌ర్మ, న‌వీన్ జిందాల్  ఎపిసోడ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌పంచ దేశాల‌ను సైతం ఈ వ్యాఖ్య‌ల‌పై మాట్లాడించేలా చేస్తోంది. వాస్త‌వానికి బీజేపీ హై క‌మాండ్ ఇప్ప‌టికే ప‌రిణామాల‌పై అప్ర‌మ‌త్తం అయినా కూడా జ‌ర‌గాల్సిన న‌ష్ట‌మేదో జ‌రిగిపోతోంది అని తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని తీవ్ర‌వాద సంస్థ‌లు కూడా భార‌తీయ స‌మాజంపై ప్ర‌తికారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్నాయి.

ఇప్ప‌టికే కొన్ని ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చాయి. ఇవి అంతటా ఆందోళ‌న‌లు రేకెత్తిస్తున్నాయి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ప్ర‌భావంతో దేశంలో ఉన్న అన్ని పార్టీలూ కూడా అప్ర‌మ‌త్తం అయి, ఇక‌పై జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని  త‌మ నాయ‌కుల‌నూ, ఇత‌రేత‌ర కార్య‌క‌ర్త‌ల‌నూ..కోరుతున్నాయి. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్ వాకిట యాక్టివ్ గా ఉండే స‌మాజ్ వాదీ పార్టీ కూడా త‌మ నాయ‌కుల‌కు దిశా నిర్దేశం చేసింది. మ‌త సంబంధ వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌న్న‌ది.అదేవిధంగా ఎటువంటి టీవీ చ‌ర్చ‌ల్లో కూడా పాల్గొన వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ప్యానెల్ డిస్క‌ష‌న్ లో పాల్గొన వ‌ద్ద‌ని చెప్పడ‌మే కాకుండా సంబంధిత విష‌యాల‌పై మాట్లాడేట‌ప్పుడు రాష్ట్రంలో ఆందోళ‌న రేగుతున్న దృష్ట్యా మ‌రికొన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు కూడా తీసుకుంటోంది అని కూడా తెలుస్తోంది.

మ‌రోవైపు అల్ల‌ర్ల నేప‌థ్యంలో బీజేపీ కూడా మ‌రోసారి జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎవ‌రు ఏ ఆందోళ‌న‌కు దిగినా అరెస్టులు ఖాయం అని హెచ్చ‌రిస్తూ అక్క‌డి ప్ర‌భుత్వం సిట్యువేష‌న్స్-ను కంట్రోల్ చేస్తుంది. ఇప్ప‌టికే అల్ల‌ర్లు కోల్ క‌తా, జార్ఖండ్ రాజ‌ధాని రాంచీ, జ‌మ్మూ అండ్ క‌శ్మీరు త‌దిత‌ర ప్రాంతాల్లో రేగినందున బీజేపీ మ‌రింత అప్ర‌మ‌త్తం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version