సామాన్యుడి బైక్‌పై షూటింగ్‌కు అమితాబ్‌.. ఫొటో వైరల్

-

ప్రస్తుతం ప్రతి స్మార్ట్ సిటీలో ఉన్న ప్రధాన సమస్య ట్రాఫిక్. ఇక ముంబయి వంటి నగరాల్లో ఈ సమస్య గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు కూడా ఈ ట్రాఫిక్ జామ్ బాధ్యులే. అలా ట్రాఫిక్​లో చిక్కుకుని చాలా మంది తారలు తమ షూటింగ్స్, ఇతర ఈవెంట్లకు ఆలస్యంగా వెళ్లినవారు ఉన్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బీ టౌన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్​కు ఎదురైంది. అయితే ఆయన ఏం చేశారంటే..?

తాజాగా అమితాబ్ బచ్చన్ ఓ సామాన్యుడి బైక్‌పై షూటింగ్‌ స్థలానికి వెళ్తూ ముంబయి వీధుల్లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. తనకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్‌ చెబుతూ బిగ్‌బీ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

‘‘నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్‌ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు’’ అంటూ అతడికి ధన్యవాదాలు చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అతడెవరో చాలా లక్కీ’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘మీరు నిజంగానే మెగాస్టార్‌’ అని మరొకరు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news