ఎమీ జాక్సన్ పెళ్లి ఎక్కడంటే..!

-

బ్రిటీష్ భామ ఎమీ జాక్సన్ తన ప్రియుడు జార్జ్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న అతనితో ఆమె పెళ్లి ఫిక్స్ చేసుకుంది. వచ్చే ఏడాది ఎమీ జాక్సన్ పెళ్లి చేసుకుంటుందని తెలుస్తుంది. గ్రీకు సంప్రదాయం ప్రకారం ఎమీ జాక్సన్ పెళ్లి జరుగుతుందట. గ్రీస్ లోని మైకొనాస్ ఐలాండ్ లో ఓ విల్లాని వీరి పెళ్లికి సిద్ధం చేస్తున్నారట.

ఐలాండ్ లో పెళ్లి అంటే బీచ్ సైడ్ వెడ్డింగ్ ప్లాన్ చేశారన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉందట ఎమీ జాక్సన్. అమెరికాలోనే సెటిల్ అయ్యి అక్కడ బిజినెస్ చేసే ఆలోచనలో ఉందట అమ్మడు. మొత్తానికి ఎమీ జాక్సన్ తన పర్సనల్ లైఫ్ లో పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉందని చెప్పొచ్చు. రజిని 2.ఓలో నటించిన ఎమీ జాక్సన్ తమిళ, హింది భాషల్లో పలు సినిమాల్లో నటించింది. ఎమీ పెళ్లి వార్త ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version